తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత

Jul 17 2026 12:41 AM | Updated on Jul 17 2026 12:41 AM

● సీజనల్‌ వ్యాధుల కట్టడిపై దృష్టి ● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

● సీజనల్‌ వ్యాధుల కట్టడిపై దృష్టి ● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

ఖమ్మం సహకారనగర్‌: ఎక్కడా ఇబ్బంది రాకుండా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు. తాగునీటి సరఫరా, సీజనల్‌ వ్యాధుల కట్టడితో పాటు విద్యాశాఖ, ఎల్‌నినో పరిస్థితులపై హైదరాబాద్‌ నుంచి గురువారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీకి సత్తుపల్లి తహసీల్‌ నుంచికలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమబద్ధీకరించాలని సూచించారు. అలాగే, వ్యాధులు ప్రబలకుండా ప్రతీ శుక్రవారం అన్ని గ్రామాలు, పట్టణా ల్లో డ్రైడే నిర్వహించాలని తెలిపారు. కాగా, ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి ఒక జత యూనిఫామ్‌ సమకూర్చాలని పేర్కొన్నారు. ఇక ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

పొరపాట్లు లేకుండా భూముల రీసర్వే

భూభారతి చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. తెలిపారు. సత్తుపల్లి తహసీల్‌లో అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌తో కలిసి ఆయన సర్వేయర్లు, గ్రామ పాలన అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రీ సర్వే ఉద్దేశం భూమిని విభజించడం కాదని తెలిపారు. భూమిని ఎవరు సాగు చేస్తున్నారు, వారి పేరిట ఎంత భూమి ఉంది, పాస్‌ ఉందా, లేదా అనేది నిర్ధారించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. ఎక్కువ లేదా తక్కువ విస్తీర్ణం నమోదైతే, అందుకు కారణాలను పరిశీలించి ధ్రువీకరించాలని తెలిపారు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో సర్వే పూర్తికాగా, కుటుంబ వివాదాలు మినహా పెద్దగా అభ్యంతరాలు రాలేదని చెప్పారు. ఈసమావేశంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ రాజేందర్‌, సత్తుపల్లి తహసీల్దార్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement