ఖమ్మంమయూరిసెంటర్: జనగణనకు సంబంధించి ప్రత్యేక క్వశ్చనీర్ (ప్రశ్నాపత్రం) సెప్టెంబర్ మొదటి వారంలోగా వచ్చే అవకాశం ఉందని సెన్సెస్ విభాగం జాయింట్ డైరెక్టర్ రఘు వెల్లడించారు. ఈమేరకు గురువారం ఆయన ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యను కలిసి జనగణన ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించి, సెన్సెస్ సామగ్రి అందజేశారు. అనంతరం జేడీ ఉద్యోగులతో సమావేశమై సూచనలు చేశారు. ప్రశ్నాపత్రం వచ్చేలోగా పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని తెలిపారు. రాష్ట్రాల వారీగా వేర్వేరు ప్రశ్నలతో క్వశ్చనీర్ సిద్ధమవుతోందని తెలిపారు. కేఎంసీ పరిధిలో లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో గణన చేపట్టాలని సూచించారు.


