మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Jul 16 2026 5:24 AM | Updated on Jul 16 2026 5:24 AM

పెద్దాస్పత్రిలో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రికి వచ్చే వారితో మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్యం అందించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ ఆదేశించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని బుధవారం తనిఖీ చేసిన ఆమె ఎంసీహె చ్‌, ఎస్‌ఎన్‌సీయూ, చిన్నారుల వార్డుల్లో వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే, జనరల్‌ ఆస్పత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశాక ఫార్మ సీ నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. అంతేకాక మరుగుదొడ్ల శుభ్రత, క్రిటికల్‌ కేర్‌ భవన నిర్మాణంపై తీసి త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌, డిప్యూ టీ సూపరింటెండెంట్‌ బి.కిరణ్‌కుమార్‌, ఆర్‌ఎంఓలు రాంబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

టీబీ బాధితులకు ఆర్థిక సాయం

డీఎంహెచ్‌ఓ రామారావు

ఖమ్మంవైద్యవిభాగం: క్షయ(టీబీ) బాధితులకు కేంద్ర ప్రభుత్వ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ‘నిక్షయ్‌ పోషణ్‌ యోజన’ ద్వారా ఆర్థిక సాయం అందుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాధి నిర్ధారణ అయిన సమయంలో రూ.3వేలు, 84 రోజుల చికిత్స తర్వాత మరో రూ3వేలు అందుతాయని వెల్లడించారు. 2025లో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.17లక్షలు విడుదల చేయగా, జిల్లాలోని 283 మంది నమోదిత బాధితులకు రూ.6వేల చొప్పున ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు రూ.39.54లక్షలు విడుదల కాగా, ఇప్పటికే గుర్తించిన 460 మంది ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. మరో 210 మందికి రూ.3వేల చొప్పున, 324 మందికి రూ.6వేల చొప్పున విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇవికాక కొత్తగా గుర్తించిన మరో 189 మంది బాధితుల వివరాలు పరిశీలించాక నిధులు విడుదల అవుతాయని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో క్షయ వ్యాధికి చికిత్స పొందుతున్న వారు నిక్షయ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నాక, ఆధార్‌ కార్డ్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ వివరాలను ఆరోగ్య కార్యకర్తలకు లేదా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అందించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.

ఆలయానికి ప్యూరిఫైడ్‌ వాటర్‌ప్లాంట్‌

ఏన్కూరు: మండలంలోని గార్లఒడ్డు శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో భక్తుల తాగునీటి కోసం పాల్వంచకు చెందిన భక్తులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌ వితరణ చేశారు. పాల్వంచకు చెందిన పట్టాభి రామారావు – విజయలక్ష్మి దంపతులు రూ.50వేల విలువైన ప్లాంట్‌ ను సమకూర్చగా సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు భూక్యా నర్సి, భూక్యా లాలు, ఈఓ ప్రసాద్‌, అర్చకులు నాగరాజు, వేణుగోపాలాచార్యులు, వరశంకర్‌, ప్రసాద్‌, రమణయ్య పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉద్యమిస్తాం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు

సత్తుపల్లిటౌన్‌: ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి విద్యా ర్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మానేసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు డిమాండ్‌ చేశా రు. బకాయిలు విడుదల చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. సత్తుపల్లి లో బుధవారం విద్యార్థులతో కలిసి ‘ఫీజు బకా యి – బీజేపీ లడాయి’పేరిట నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా రింగ్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. కేంద్రం తన వంతు నిధులు ఇస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వాక దాని పుల్లారావు, బి.వీరంరాజు, నాయుడు రాఘవరావు, సుదర్శన్‌ మిశ్రా, నరేశ్‌, డాక్టర్‌ పెద్దిరాజు, బి.విజ య్‌, శివకృష్ణ, కార్తీక్‌, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement