పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యం

Jul 16 2026 5:24 AM | Updated on Jul 16 2026 5:24 AM

మధిర/ఎర్రుపాలెం: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా తొలగించే లక్ష్యంతో మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎంపీ లాడ్స్‌ నిధు లు రూ.60 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు మధిర మండలం మాటూరుపేట, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, మీనవోలు, తక్కెళ్లపాడు, ఇనగాలి, ఎర్రుపాలెం, రేమిడిచర్ల గ్రామాల్లో ఎంపీ నిధులతో నిర్మాణం పూర్తయిన 14 రహదారులను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తక్కెళ్లపాడు గ్రామంలోని దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవసరమైన అన్నిచోట్ల రోడ్లకు నిధులు కేటాయిస్తున్నానని చెప్పారు. కాగా, ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైలుకు హాల్టింగ్‌ ఇప్పించాలని పలువురు వినతిపత్రం ఇవ్వగా ఉన్నతాధికారులతో మాట్లాడతామని ఎంపీ తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు రాయబారపు పుల్లారావు, ముక్కర రామకృష్ణారెడ్డి, అనసూర్య, కోట కన్నమ్మ, నండ్రు స్వప్న, బలుసుపాటి జయరాజు, మధిర మార్కెట్‌, సొసైటీ చైర్మన్లు బండారు నర్సింహారావు, అక్కిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, నాయకులు కోట రాంబాబు, సూరంశెట్టి కిశోర్‌, అమరవాది సత్యనారాయణరెడ్డి, కర్నాటి రామారావు, యన్నం కోటేశ్వరరావు, శ్రీనివాసరాజు, రవికాంత్‌, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కడియం శ్రీనివాసరావు, శీలం వెంకట్రామిరెడ్డి, కొత్తపల్లి ప్రశాంత్‌, కూరపాటి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement