జిల్లాకు టీజీ టీ–20 రన్నరప్‌ జట్టు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు టీజీ టీ–20 రన్నరప్‌ జట్టు

Jul 15 2026 12:29 AM | Updated on Jul 15 2026 12:29 AM

ఖమ్మంస్పోర్ట్స్‌/ఖమ్మంసహకారనగర్‌: జిల్లాలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము కూడా సహకరిస్తామని అమ్మ ఫౌండేషన్‌ చైర్మన్‌ మల్లు నందిని తెలిపారు. ఇటీవల ముగిసిన టీజీ టీ–20 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ‘అన్విత – ఖమ్మం ఏసెస్‌’ జట్టు సభ్యులు మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా అభినందన ర్యాలీ నిర్వహించాక జరిగిన సమావేశంలో ఆమె క్రీడాకారులను సన్మానించి మాట్లాడారు. క్రీడాకారుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్విత ఖమ్మం ఏసెస్‌ జట్టు రన్నరప్‌గా నిలువడం గర్వకారణమన్నారు. అనంతరం జట్టు కెప్టెన్‌ చామా వజ్రేంద్ర మిలింద్‌, క్రీడాకారులు మల్లు సహేంద్రవిక్రమాదిత్య తదితరులు ఎస్‌బీఐటీ కాలేజీకి వెళ్లగా మల్లు నందినితో పాటు కాలేజీ చైర్మన్‌ గుండాల కృష్ణ సన్మానించారు. జిల్లా జట్టు హెడ్‌ కోచ్‌ అభిజిత్‌ చటర్జీ, జట్టు ఫ్రాంచైజీ యజమాని గోపన్న అచ్యుతరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement