భద్రగిరిలో మౌనదీక్ష చేపట్టిన ప్రభుత్వ సలహాదారుడు వీహెచ్
భద్రాచలం: అందరి దేవుడైన అయోధ్య రాముడికి గుడి నిర్మించాక ప్రారంభానికి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా బీజేపీ నాయకులు అవమానించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు వీహెచ్.హనుమంతరావు పేర్కొన్నారు. అయోధ్యలో అక్రమాలు, అవినీతి ఆరోపణలకు నిరసనగా భద్రాచలంలో ఆయన సోమవారం 30 నిమి షాల మౌన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించాక వీహె చ్ మాట్లాడుతూ రాముడి పేరుతో గుడి కట్టించిన బీజేపీ ప్రభుత్వం నిర్మాణం మొదలు హుండీల వరకు దోచుకుంటోందని విమర్శించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినందున, అయోధ్యలో అక్రమాలపై సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాముడికి హనుమంతు పేరు కలిగిన తన కంటే పెద్ద భక్తుడు ఎవరు ఉంటారని ప్రశ్నించారు. రాముడంటే అయోధ్య రాముడే కాదని, భద్రగిరిలో ఉండేది కూడా రాముడేనని తెలిపారు. అందుకే భద్రగిరి రామయ్య చెంతన మౌన దీక్ష చేపట్టానని, ఈనెల 19వ తేదీన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భద్రాచలం దేవస్థానం అభివృద్ధి చేస్తున్నందున, కేంద్రం కూడా నిధులు విడుదల చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ భక్తులు విరాళాల రూపంలో అందించిన సొమ్మును కాపాడుతూ వసతుల కల్పించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ దీక్షలో నాయకులు తోట దేవీప్రసన్న, పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


