నిజాయితీ చాటుకున్న హోంగార్డు | - | Sakshi
Sakshi News home page

నిజాయితీ చాటుకున్న హోంగార్డు

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

ఖమ్మంక్రైం: ఏటీఎం మిషన్‌లో ఖాతాదారుడు మర్చిపోయిన డబ్బును బ్యాంక్‌ ఉద్యోగులకు అందజేసి హోంగార్డు తన నిజాయితీ చాటుకున్నాడు. ఖమ్మంకు చెందిన హోంగార్డు రాంప్రసాద్‌ సోమవారం ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లాడు. అప్పటికే మిషన్‌లో ఓ ఖాతాదారుడు డ్రా చేసిన రూ.10వేల నగదు ఉంది. దీంతో రాంప్రసాద్‌ ఆ నగదును బ్యాంక్‌ మేనేజర్‌కు అప్పగించగా అధికారులు ఆయనను అభినందించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యాన

అవగాహన

కూసుమంచి: విపత్తుల సమయాన అప్రమత్తంగా ఉండడంతో పాటు రక్షించుకోవాల్సిన విధానాలపై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు అవగాహన కల్పించారు. మండలంలోని పాలేరు గ్రామంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వరదల సమయాన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరదల్లో చిక్కుకుంటే ఎలా బయటపడాలో వివివరించారు. గతంలో పాలేరు రిజర్వాయర్‌కు భారీ వరద వచ్చి నష్టం జరిగినందున ఈ సదస్సు ఏర్పాటుచేసినట్లు తహసీల్దార్‌ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్‌కుమార్‌ తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఐ జ్యోతి, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement