సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక కోసం కొత్తగూడెంలోని సీఈఆర్ క్లబ్ స్విమ్మింగ్ పూల్‌లో సోమవారం పోటీలు నిర్వహించారు. అనంతరం జట్టు వివరాలను స్విమ్మింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి హన్మంతరాజు వెల్లడించారు. గ్రూప్ ఏలో పి.వరప్రసాద్, ఏ.సాయికార్తీక్, జె.అజయ్, జె.లలిత్‌సాయి ఎంపిక కాగా, గ్రూప్ బీలో కె.హరీష్, సీహెచ్.శివకార్తికేయ, బి.శ్రీనాగచైతన్య, కె.నీరజ్, పి.నోయల్ విన్సెంట్, కె.మదన్, విష్ణువర్ధన్, గ్రూప్ సీలో సీహెచ్.మోక్ష చంద్రశేఖర్, ఆర్.ప్రతీక్ సింగ్, జి.హషిత్ సాయి, పి.హర్షిత్ చరణ్, ధనుంజయ్, వి.మనీష్, ఎం.తోషన్, వి.దేదీప్యసాయి, గ్రూప్ డీ జట్టుకు జి.మాన్విక్, ఏ.స్నేహిత్, ఎం.కేతన్, కె.లిఖిల్, పి.భవిష్, సీహెచ్.శ్రీధయి, సీహెచ్.కృష్ణవేణి, కృతిక, టి.లక్ష్మి హయాతి, సీహెచ్.జాన్విక ఎంపికయ్యారని తెలిపారు. ఈ జట్లు 18, 19వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో పాల్గొంటారని వివరించారు.


