సాంకేతికతోనే సైబర్‌ నేరాల కట్టడి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతోనే సైబర్‌ నేరాల కట్టడి

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

గంజాయి కట్టడికి విస్తృత తనిఖీలు

ఖమ్మంక్రైం: సైబర్‌ నేరాల కట్టడితో పాటు డిజిటల్‌ భద్రతను పటిష్టం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. సైబర్‌నేరాల నియంత్రణ, దర్యాప్తులో పాటించాల్సిన విధానాలపై పోలీసుస్టేషన్ల హౌస్‌ ఆఫీసర్లకు సోమవారం పీటీసీలో శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ సైబర్‌ ప్రమాదాలను ఎదర్కొవడానికి బలమైన, విధానపరమైన సమన్వయం అవసరమని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు సాంకేతికతను వాడుకుంటున్నట్లే పోలీసులు అదే సాంకేతికత ఆధారంగా వారి ఆట కట్టించాలని సూచించారు. అంతేకాక ఎవరూ సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సదస్సులో అడిషనల్‌ డీసీపీ రామానుజం, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఫణీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపైకి కేజ్‌ వీల్స్‌తో వస్తే చర్యలు

రోడ్లపై కేజ్‌ వీల్స్‌ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్‌దత్‌ హెచ్చరించారు. ప్రజారవాణా కోసం ప్రభుత్వం నిర్మించిన రహదారులు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈమేరకు రైతులు పొలాల వద్ద పని ముగిశాక కేజ్‌ వీల్స్‌ తొలగించి సాధారణ టైర్లు అమర్చుకోవాలే తప్ప అలాగే రోడ్లపై నడపొద్దని సూచించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి శివారులో ఆర్‌అండ్‌బీ రోడ్డుపై కేజ్‌ వీల్స్‌తో ట్రాక్టర్లు నడుపుతున్నారనే ఆర్‌అండ్‌ బీ అధికారుల ఫిర్యాదు మేరకు డ్రైవర్లు సారా కృష్ణ, పమ్మి కృష్ణయ్య, గుత్తి ముత్యాలరావు, బోసి కోర్రాజుపై కేసు నమోదు చేయడమే కాక ట్రాక్టర్లు సీజ్‌ చేశామని తెలిపారు. ఈమేరకు రైతులు, ట్రాక్టర్ల యజమానులు నిబంధనలు పాటించాలని సీపీ ఓ ప్రకటనలో కోరారు.

యువత భవిష్యత్‌ను కాపాడేలా మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు జిల్లా సరిహద్దులు, జాతీయ రహదారులపై విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు సీపీ సునీల్‌దత్‌ తెలిపారు. గంజాయి రవాణా మార్గాలపై టాస్క్‌ఫోర్స్‌, ఈగల్‌ఫోర్స్‌ సిబ్బందే కాక ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో 55 కేసులు నమోదు చేయగా, రూ.2.24కోట్ల విలువైన 450 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 123మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో గంజాయి మూలాలను గుర్తించి శాశ్వతంగా నిర్మూలించేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, గంజాయి రవాణా, విక్రయాలు, సాగు వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement