ఖమ్మం సహకారనగర్: ఎన్నికల సమయాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జన జాగరణ యాత్ర సోమవారం ఖమ్మంకు చేరుకుంది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా ఆయన మాట్లాడారు. ర్యాలీలో దివ్యాంగ, మహిళా ఉద్యోగులు సంఘాలకు అతీతంగా వందల సంఖ్యలో పాల్గొనడం పాత పెన్షన్ పునరుద్ధరణ ఆవశ్యకతను తెలియచేస్తోందని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌తో పాటు మిగతా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు మోబీన్ అహ్మద్, రాగి సురేష్, లక్ష్మణాచారితో పాటు వివిధ సంఘాల నాయకులు గుగులోత్ మోహన్, ఎం.శ్వేత, నాగమణి, బంగారయ్య, క్రాంతి, రాజశేఖర్, శ్రీకాంత్, సుభాన్, కె.సంపత్, టి.సాయికృష్ణ, పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్.విజయ్, వెంగళరావు, మల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, నాగుల్ మీరా, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, గండ్ర వెంకటరమణారెడ్డి, లింగానాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ సీపీఎస్‌ఈయూ
రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ


