కూసుమంచి/తల్లాడ: కొత్తగూడెం, మణుగూరులో సోమవారం జరిగిన సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు, ఎంపీ డీ.కే.అరుణ తదితరులకు స్వాగం పలకగా అల్పాహారం తీసుకున్నాక నాయకులు బయలుదేరారు. అలాగే, మార్గమధ్యలో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ వద్ద కూడా నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. అంతేకాక వివిధ సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర్‌రావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు మేక సంతోష్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, చావా కిరణ్, రుద్ర ప్రదీప్, గోంగూర వెంకటేశ్వర్లు, శ్యామ్‌రాథోడ్, గడ్డం వెంకటేశ్వర్లు, గుండా ఉపేందర్‌రెడ్డి, ఉపేందర్ గౌడ్, పుణ్యవతి, చల్లా నాగులు, ఆపతి వెంకటరామారావు, గాదె కృష్ణారావు, చల్లా తిరుమలాదేవి, పెరికె కిరణ్, స్వర్ణలత పాల్గొన్నారు.


