ఖమ్మంమామిళ్లగూడెం: రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తెలిపారు. ఖమ్మం టీఎన్జీవోస్ హాల్‌లో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే కల్యాణలక్ష్మి ద్వారా రూ.2 లక్షలు ఇస్తుండడమే కాక ఈ ఏడాది 2 వేల మందికి వాహనాలు అందించామని తెలి పారు. అంతేకాక పదోన్నతి వచ్చిన చోటే ఉద్యోగులు కొనసాగేలా జీఓ జారీ చేసిందని చెప్పారు. కాగా, దివ్యాంగ మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఏ సమస్య ఉన్నా జిల్లాలో ని ముగ్గురు మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రానికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు కుంచం ఉప్పలయ్య మాట్లాడుతూ.. వేయి గజాల్లో దివ్యాంగుల భవనం ఏర్పాటుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని చెప్పారు. అనంతరం పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడగా స్టడీ సర్కిల్ సంస్థ చైర్మన్ నరసింహారావు, నాయకులు తాటికొండ రమేశ్, కోటి, ఈడబోయిన సురేశ్, యూసుఫ్, షేక్ ముస్తఫా, డోన్‌వాన్ నాగరాజు, బండి వెంకటరమణ, వడ్డెపూడి లక్ష్మయ్య, షేక్ జానీ, తేళ్ల ప్రవీణ్‌కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు.


