వైరా రిజర్వాయర్‌కు 550 క్యూసెక్కులు | - | Sakshi
Sakshi News home page

వైరా రిజర్వాయర్‌కు 550 క్యూసెక్కులు

Jul 13 2026 12:10 AM | Updated on Jul 13 2026 12:10 AM

వైరా/ఏన్కూరు: సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాల్లో 550 క్యూసెక్కుల నీటిని వైరా రిజర్వాయర్‌కు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ తెలిపారు. ఈమేరకు ఏన్కూరు మండలం తిమ్మరావుపేట ఎస్కేప్‌ లాక్‌ల వద్ద ఆదివారం ఆయన రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశాక గంగమ్మకు హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి జలాలను సాగర్‌ కాల్వ ద్వారా రిజర్వాయర్‌లోకి చేర్చడంతో ఆయకట్టు కింద 30వేల ఎకరాల్లో పంటల సాగుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సొసైటీ చైర్మన్‌ శెట్టిపల్లి వెంకటేశ్వరావు, నాయకులు స్వర్ణ నరేందర్‌, బొర్రా రాజశేఖర్‌, వడ్డే నారాయణ, డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, లచ్చిరాం నాయక్‌, మేడా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement