చింతకాని: మండలంలోని మత్కేపల్లి క్రాస్ వద్ద శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ ప్రాంగణంలో భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. ప్రాంగణం, పార్కింగ్ స్థలంతో పాటు భోజనశాల వద్ద ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, పేపర్ ప్లేట్లు పోగయ్యాయి. ఈ మేరకు మధిర, చింతకాని, ముదిగొండ, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లోని గ్రామపంచాయతీల నుంచి వంద మంది పారిశుద్ధ్య కార్మికులతో శనివారం ఉదయం చెత్త తీయిస్తూ ట్రాక్టర్ల ద్వారా డంప్ యార్డులకు తరలించారు. ఈ మేరకు పనులను జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు పరిశీలించారు. సభా ప్రాంగణం పూర్తిస్థాయిలో శుభ్రం అయ్యేవరకు పనులు కొనసాగుతాయని తెలిపారు. మరోపక్క సభావేదిక, జర్మన్ హ్యాంగర్లతో ఏర్పాటు చేసిన గుడారాలను సైతం తొలగిస్తున్నారు.
పరిశీలించిన డీపీఓ రాంబాబు


