అనుబంధ మందిరాల్లో కూడా
ఆధునికీకరణ పనులు
ఏళ్ల తర్వాత కొత్త కళ
సంతరించుకోనున్న భద్రగిరి
తీగల వంతెన కూడా నిర్మించాలని భక్తుల వేడుకోలు
రామాలయం పక్కనే ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ భాగం విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి దేవాదాయ శాఖకు అందజేశారు. ఉత్తరం దిక్కున శివపార్వతుల ప్రతిమలతో స్వాగతం పలుకుతుండగా, శివరాత్రి, ఇతర ఉత్సవాల రోజుల్లో రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణం సరిపోవటం లేదు. దీంతో దక్షిణ భాగం వైపు విస్తరణతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
దేవస్థానానికి అనుబంధంగా శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు, శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి, యోగానంద లక్ష్మీ నరసింహాలయం, రంగనాయకుల గుట్టపై రంగనాథ స్వామి, తాతగుడి సెంటర్‌లో గోవిందరాజ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ధూపదీప నైవేద్యాలతోపాటు నిత్యపూజలు రామాలయ సిబ్బందే నిర్వర్తిస్తున్నారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు తప్ప ఇతర ఆలయాలకు తగిన ప్రచారం లేదు. దేవస్థానం నుంచి నేరుగా వెళ్లేందుకు కనెక్టివిటీ కూడా లేదు. దీంతో తీగల వంతెన తదితర నిర్మాణాలు చేపట్టాలనే వినతులు వస్తున్నాయి.
రామాలయానికి పడమర దిక్కున ఉన్న యోగా నంద లక్ష్మీ నరసింహాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. పూర్వకాలం రాముడిని దర్శించుకునే ముందు ఈ స్వామివారిని దర్శించుకునేవారని పెద్దలు చెబుతున్నారు. రామాలయం నుంచి ఈ ఆలయానికి నేరుగా కనెక్టివిటీ కల్పిస్తే ఆదరణ లభించనుంది. లక్ష్మీ నరసింహాలయం నుంచి గో దావరి వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా తీగలవంతెన నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. అయితే, ఇప్పటికే కల్యాణ మండప ప్రాకారాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.
శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం రామాలయ ప్రాంగణంలో ఉంది. సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ అమ్మవారి ని దర్శించుకుంటారు. భక్తులకు ఇక్కడే వేదాశీర్వచనం ఇస్తారు. దసరా వేడుకలు నిర్వహిస్తారు. అభివృద్ధి పనుల్లో ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో తొలగించనున్నారు. ఆలయ ప్రాకారాల ఏర్పాటులో భాగంగా నిర్మాణం వేదిక మారనుంది.
తాతగుడి సెంటర్‌లో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులను చేపట్టేలా దేవస్థానం అధికారులు ప్రణా ళికలను రూపొందించాలని భక్తులుకోరుతున్నారు. ప్రస్తు తం ప్రసాద్ పథకంలో భాగంగా టూరిజం హోటల్‌లో నిరుపయోగంగా ఉన్న బ్యాటరీ వాహనాలతోపాటు ఇతర ఉచిత రవా ణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భద్రాచల రామాలయ
అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి


