రామాలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామి ఉపాలయం తొలగింపు లేదని ప్రస్తుతం పేర్కొంటున్నా.. ఉపాలయాలు, ప్రధాన ఆలయం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరిగాక ఇక్కడ కూడా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆళ్వార్ల ఉపాలయాలు సైతం అభివృద్ధిలో భాగంగా మార్పు కానున్నాయి.
రామయ్య స్వామిని దర్శించుకున్నాక ఆలయం నుంచి రంగనాయకుల గుట్టవరకు భక్తులు సుమారు అర కిలోమీటరు నడిచివెళ్లాల్సి వస్తోంది. శివాలయం పక్క నుంచి 100 మీటర్ల రోడ్డు నిర్మిస్తే రంగనాథస్వామి ఆలయం, భక్త రామదాసు ధ్యాన మందిరం సులభంగా సందర్శించుకోవచ్చు. గుట్టపైన వ్యూ పాయింట్ ఏర్పాటు చేయవచ్చు.


