ఖమ్మం సహకారనగర్: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచడంతో పాటు వారు ఉన్నత స్థాయికి చేరేలా సైన్స్ మ్యూజియం దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్ మ్యూజియంను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ఈ మ్యూజియం ద్వారా కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ మ్యూజియంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీపీ సునీల్‌దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఈఓ చైతన్య జైనీ, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ పసుమర్తి రాంమోహన్‌రావు, హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవిమారుత్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ఎంఈఓలు శైలజాలక్ష్మి, రాములు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఫోరం బాధ్యులు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మం అర్బన్: ఖమ్మం 34, 35, 36వ డివిజన్లలో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


