‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలుచోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగిస్తుండగా.. ఇన్నాళ్లు మురికికూపాలుగా ఉన్న ప్రాంతాల్లో మార్పు వస్తోంది. ముదిగొండ మండలం బాణాపురంలో బస్టాండ్ సమీపాన చెత్త పేరుకుపోవడంతో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనదారులు దుర్వాసనతో ఇబ్బంది
పడేవారు. ఈక్రమాన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అక్కడి చెత్తను తొలగించడంతో
వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఒక్కరోజుతో సరిపెట్టకుండా
ఎప్పటికప్పుడు చెత్త సేకరిస్తూ డంపింగ్ యార్డుకు చేర్చాలని, అక్కడ తగలబెట్టకుండా
ఎరువు తయారీపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. – ముదిగొండ


