వసూళ్లపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

వసూళ్లపై ఫోకస్‌

Mar 11 2026 7:32 AM | Updated on Mar 11 2026 7:32 AM

● ఇప్పటివరకు రూ.23 లక్షలు సీ్త్రనిధి రుణాల రికవరీ ● సభ్యుల వద్దకు వెళ్తున్న ఉద్యోగులు

లక్ష్యం మేరకు..

ఖమ్మంమయూరిసెంటర్‌: మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చిన సీ్త్రనిధి రుణాల వసూళ్లకు మెప్మా, సీ్త్ర నిధి అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. సభ్యుల ఇళ్లు, వారి ప్రాంతాలకు బృందాలుగా వెళ్లి సమావేశాలు నిర్వహించి రుణాల చెల్లింపు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. సకాలంలో చెల్లిస్తే తిరిగి రుణం అందుతుందని, ఆ నగదుతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవచ్చని అవగాహన కల్పిస్తున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలతో..

సీ్త్రనిధి రుణాలు పొందిన వారిలో పలువురు తిరిగి చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కొందరు సభ్యులు చెల్లించినా అవి సీ్త్రనిధి ఖాతాల్లో సక్రమంగా జమ కావడం లేదు. ఇంకొన్ని చోట్ల సభ్యుల పేరిట మంజూరైన నగదును ఇతర సభ్యులు, ఆర్పీలు వినియోగించుకున్నట్లు వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ఆదేశాలతో మెప్మా అధికారులు సీ్త్రనిధి రుణ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సభ్యుల వద్దకే నేరుగా వెళ్తూ వసూళ్లు చేపడుతున్నారు.

రుణ సంబంధించిన బకాయిల వసూళ్లకు అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఈనెల 25వ తేదీ లోపు రూ.25 లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మెప్మా టీఎంసీ, సీఓలు క్షేత్ర స్థాయిలో సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు రూ.23లక్షలు వసూలయ్యాయి. ఇకపై ప్రతీనెల లక్ష్యానికి అనుగుణంగా సభ్యుల నుండి రికవరీ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement