యూరియా కోసం తిప్పలు
సాక్షి నెట్‌వర్క్: యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. బోనకల్ మండలం ముష్టికుంట్ల సొసైటీలో 711బస్తాలు ఉండగా బుధవారం తెల్లవారుజామునే బారులు దీరారు. ఉన్నంత వరకు పంపిణీ చేయగా, డీసీఓ గంగాధర్, తహసీల్దార్ రమాదేవి, ఏడీఏ స్వర్ణ విజయచంద్ర, ఏఓ వినయ్‌కుమార్, ఎస్‌ఐ పి.వెంకన్న పరిశీలించారు. తల్లాడ సొసైటీలో 440 బస్తాల యూరియాను కూపన్ల ఆధారంగా పంపిణీ చేశారు. సీఈఓ నాగబాబు, ఎస్‌ఐ వెంకటేశ్, ఏఓ ఎండీ.తాజుద్దీన్ పర్యవేక్షించారు. కొణిజర్లలోని మన గ్రోమోర్, చిన్నగోపతిలో తెల్లవారుజామున 4గంటలకే వేయి మంది రావడం, 300 బస్తాల యూరియానే ఉండగా ఎస్‌ఐ సూరజ్ నేతృత్వాన ఉన్నంత వరకు పంపిణీ చేయించారు. చింతకాని, నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
●కూసుమంచి : యూరియా సరిపడా ఉన్నందున రైతులందరికీ సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా నోడల్ అధికారిగా నియమితులైన ఆయన కూసుమంచి మండలంలో యూరి యా పంపిణీని పరిశీలించి మాట్లాడారు. ఏడీఏ సతీష్, ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు.


