అపస్మారక స్థితిలో తల్లి.. ఆపదలో చిన్నారులు
వైరా: ఇద్దరు పిల్లలతో ఊరికి వెళ్లడానికి బయలుదేరిన ఓ మహిళ వైరా బస్టాండ్ సమీపాన అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఇద్దరు చిన్నారులను పోలీసులు, వీధి వ్యాపారులు చేరదీసి వారి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చంటిపిల్లలతో ఏపీలోని వత్సవాయి మండలం పోలంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వైరాకు వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ వైరా బస్టాండ్ సమీపాన అచేతనంగా పడిపోయింది. దీంతో విష యం ఏమిటో తెలియక చిన్నారులు రోదిస్తుండగా పోలీసులు, వీధివ్యాపారులు వారిని చేరదీసి పండ్లు అందించడమే కాక వివరాలు ఆరా తీశారు. ఆపై కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళ తాత వచ్చి ఆటోలో అంజనాపురం తీసుకెళ్లాడు.


