ఆటో డ్రైవర్ నిజాయితీ
●35 గ్రాముల బంగారం అప్పగించిన రవి
ఖమ్మం అర్బన్: ప్రయాణికురాలు మరిచిపోయిన బంగారు ఆభరణాలను తిరిగి జాగ్రత్తగా అప్పగించిన ఆటోడ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. పాలేరు ప్రాంతానికి చెందిన నాగారం ధనలక్ష్మి శనివారం రాత్రి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తన నగల బ్యాగ్‌ను ఆటోలోనే మరిచి పోయి దిగింది. ఆటోడ్రైవర్ బాలపేటకు చెందిన బానోతు రవికి కాసేపయ్యాక గుర్తించి తన స్నేహితుడు బానోతు గోపి, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు పాల్వంచ కృష్ణతో కలిసి టూటౌన్ పోలీసులకు అప్పగించారు. బ్యాగ్‌లో పరిశీలిస్తే 35 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండడంతో అందులోని వివరాల ఆధారంగా యజమా ని ధనలక్ష్మిని గుర్తించి సోమవారం సీఐ బాలకృష్ణ సమక్షాన అప్పగించారు. ఈ సందర్భంగా డ్రైవర్ రవిని పలువురు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో
ఉద్యోగికి గాయాలు
కొణిజర్ల: కొణిజర్ల సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీడీఓ కార్యాలయం అటెండర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీఓ కార్యాలయం అటెండర్ ఎండీ.ఇసాక్ సోమవారం ద్విచక్రవాహనంపై ఖమ్మం నుంచి కొణిజర్ల వస్తుండగా ఓ వెంచర్ వద్ద రోడ్డు పక్కన పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన వాహనం అదుపు తప్పిందా, ఇతర వాహనం ఢీకొట్టిందా అనేది తెలియ లేదు. ఈ మేరకు ఇసాక్‌ను 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.


