పెండింగ్ లేకుండా పరిష్కారం
స్థలం తిరిగి ఇప్పించండి
● ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులు, వినతిపత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆయన పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు 2024–25 నుంచి పండ్లు సరఫరా చేస్తున్న తమపై పాత రేట్లతో భారం పడుతున్నందున ధరలు పరిశీలించాలని కోరారు.
● కొణిజర్ల మండలం బొట్లకుంటకు చెందిన రైతులు గ్రీన్‌ఫీల్డ్ హైవేతో చెరువు వరద పొలాల్లోకి చేరుతున్నందున సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
● రంగనాయకుల గుట్ట వద్ద మున్నేటిపై చెక్‌డ్యాంను తొలగించడమే కాక ప్రకాష్‌నగర్ బ్రిడ్జి దగ్గర చెక్‌డ్యాం ఎత్తు తగ్గించాలని పలువురు కోరారు.
● సత్తుపల్లి మండలం కొమ్మేపల్లికి చెందిన గుర్రాల తేజోరమ్మ తనకు పునరావాసం చట్టం క్రింద కేటాయించిన ప్లాట్‌ను మరోచోటకు మార్చాలని విన్నవించింది.
కల్లూరు సమీపాన ఉన్న భూమిని తనతో పాటు కుమారులకు తెలియకుండా కుమార్తెలు ఇద్దరు 23కుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వృద్ధురాలినైన నాకు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున విచారణ జరిపించి న్యాయం చేయాలి.
– తోట సక్కుభాయి, ఎర్రమాడు, ఆంధ్రప్రదేశ్
పెండింగ్ లేకుండా పరిష్కారం


