మానవ సంబంధాల ప్రతిరూపం ‘ఫొటో’..
ఖమ్మంగాంధీచౌక్: మాసవ సంబంధాల ఆదర్శనీయతపై ప్రదర్శించిన ‘ఫొటో’నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నెల్లూరుకు చెందిన క్రాంతి ఆర్ట్స్ థియేటర్స్ కళా సంస్థ బృందం ‘ఫొటో’నాటిక ప్రదర్శించింది. కుటుంబ బంధాల పట్ల నాడు ఎలా ఉంది, నేటి తరంలో ఎలా ఆచరిస్తున్నారన్న తీరును స్పష్టంగా వివరిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఖానాపురం మాజీ సర్పంచ్ బుగ్గవీటి సరళ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పెనుగొండ శ్రీనివాసరావు, డాక్టర్ వాసుదేవ్, మిక్కిలినేని నరేంద్ర, నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, డాక్టర్ నాగబత్తిని రవి, నామ లక్ష్మీనారాయణ, వేము ల సదానందం, వీరబాబు, నవీన్ పాల్గొన్నారు.


