● దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఎగ్జిబిట
●వైర్‌లెస్ ఈవీ చార్జింగ్
ఖమ్మం విన్‌ఫీల్డ్ హైస్కూల్‌కు చెందిన భువన సాత్విక్, టి.నీరజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు వైర్‌లెస్ చార్జింగ్ విధానంపై ఎగ్జిబిట్ రూపొందించారు. వాహనాలు వెళ్తుండగానే ఆటోమెటిక్‌గా చార్జింగ్ అయ్యేలా ‘రోడ్ ప్రాజెక్ట్’తయారు చేశారు. దీంతో వాహనాలకు అవసరమైన చార్జింగ్ సమయాన్ని తగ్గించి పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు.
●అన్నదాతల కష్టాలు తొలగేలా..
రైతులు కష్టాలు తగ్గేలా ఖమ్మం వివాన్ ది స్కూల్‌కు చెందిన విద్యార్థిని బృందం మల్టీ పర్పస్ ఆటోమెటిక్ ఇరిగేషన్ సిస్టమ్ తయారు చేసింది. పైథాన్ కోడింగ్ అమలు చేయడంతో సుమారు ఐదెకరాల వరకు పంటకు నీరు అందించడం సులువవుతుంది. రైతులకు సమయం కలిసి రావడంతో పనులు వేగంగా జరుగుతాయని వెల్లడించింది.
● దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఎగ్జిబిట


