రేపు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఖమ్మంమయూరిసెంటర్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న ఖమ్మంలో నిర్వహిస్తున్నందున అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. నగరంలో ఆదివా రం ఉదయం ముస్తఫానగర్ నుంచి త్రీటౌన్ మీదుగా మయూరిసెంటర్, డిపో రోడ్డు, రాపర్తినగర్, గట్టయ్యసెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్ మీదుగా వైఎస్సార్ నగర్ కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కూడళ్లలో కేక్‌లు కట్ చేయడమే కాక వైఎస్సార్ నగర్ కాలనీలో రక్తదానశిబిరం, అన్నదానం ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆలస్యం సుధాకర్, కన్నెబోయిన సీతారామయ్య, మర్రి శ్రీనివాస్, మందడపు శ్రీని వాస్, సట్టు సత్యనారాయణ, కొత్త బాలాజీ, పెంట్యాల ఉపేందర్, పగిళ్ల నరేష్, సరికొండ రామరాజు, ఆలస్యం నరసయ్య, సతీష్, రియాజ్, బోయిన ఉపేందర్, కోదాటి నరసింహ, మర్రి దిలీప్, గణపరపు మురళి, నాగరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


