తిరిగి విధుల్లోకి తీసుకోండి
ఖమ్మం సహకారనగర్: ఇటీవల సస్పెన్షన్‌కు గురైన బీరోలు హెచ్‌ఎం రవి, టర్మినేట్ చేసిన రఘునాథపాలెం కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ లతను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి శుక్రవారం వినతిపత్రం అందజేశా రు. అనంతరం ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ వైస్ చైర్మన్ దేవరకొండ సైదులు మాట్లాడుతూ సస్పెన్షన్లు ఉపాధ్యాయుల ఆత్మస్థైరాన్ని దెబ్బతిస్తాయన్నారు. ఈమేరకు పునరాలోచన చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజయ్, రాయల వీరస్వామి, ప్రసాద్, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, వెంగళరావు, మన్సూర్, యాదగిరి, మట్టా శ్రీనివాసరావు, శిరీష పాల్గొన్నారు.


