ఇదే ఉత్సాహం కొనసాగాలి
కల్లూరు/తల్లాడ: ఇటీవల జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలిచారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. కల్లూరు, తల్లాడ మండలాల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లతో పాటు వార్డుసభ్యులను శుక్రవారం ఆయన సన్మానించి మాట్లాడారు. గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వీరి గెలుపులో కీలకంగా పనిచేసిన పార్టీ శ్రేణులు ఇదే ఉత్సాహంతో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ము న్సిపల్ ఎన్నికల్లోనూ విజయానికి పాటుపడాలని తెలిపారు. కాగా, నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ మద్దతుదారులకు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు రాకుండా చూస్తానని బెదిరించారని తెలిపారు. ఇలా జరగకపోతే మరిన్ని స్థానాలు గెలిచేవాళ్లమని సండ్ర వెల్లడించారు. కాగా, ఓడిపోయిన అభ్యర్థులు నిరాశ చెందకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచ్‌లు పెరికె నాగేశ్వరరావు, గొడ్ల ప్రభాకర్, కోసూరి ధనలక్ష్మి, కోడూరి ఉమారాణి, వనగండ్ల మాధవరావు, నల్లగొర్ల పద్మ, కట్టా ధనమ్మ, జీనుగు శ్రీనివాసరావు, కాటమనేని విజయలక్ష్మి, వేము కృష్ణ, ఖమ్మంపాటి లక్ష్మి, రాచబంటి చిన్ని కృష్ణయ్య, పోట్రు శ్రీనివాసరావు, కంచెపోగు సుజాత, గుగులోత్ శ్రీను, కోలేటి శ్రీనివాసరావు, నాయుడు వెంకటకృష్ణ, బేబీ స్వరాజ్యలక్ష్మిని సన్మానించారు. కార్యక్రమాల్లో నాయకులు పాలెపు రామారావు, వీరమోహన్‌రెడ్డి, కట్టా అజయ్ కుమార్, లక్కినేని రఘు, మేకల కృష్ణ, కాటమనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దిరిశాల దాసురావు, శివారెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కోసూరి నరసింహారావు, దూపాటి భద్రరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌ల సన్మాన సభల్లో
మాజీ ఎమ్మెల్యే సండ్ర


