వచ్చేనెలలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభలను ఖమ్మంలో వచ్చేనెల 23నుంచి 25వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ తెలిపారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలోనే మహాసభలు జరగాల్సి ఉన్నా గ్రామపంచాయతీ ఎన్నికలతో వాయిదా వేశామని వెల్లడించారు. ఈమేరకు ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మంలో జనవరి 23నుంచి నిర్వహించే రాష్ట్ర మహాసభల్లో విద్యార్థులు, లౌకికవాదులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పీడీఎస్‌యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిప్పారపు లక్ష్మణ్, వి.వెంకటేష్, నాయకులు యశ్వంత్, వినయ్, శశికిరణ్, సాధిక్, హరిచంద్ర ప్రసాద్, సురేష్, అన్వేష్, కార్తీక్, రఘు, ప్రణవ్ పాల్గొన్నారు.
నేడు, రేపు చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్, సేల్స్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం టీఎన్జీవోస్‌భవన్‌లో శని, ఆదివారం చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్, సేల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం లిమి టెడ్ డివిజనల్ మార్కెటింగ్ అధికారి బొట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్, సేల్స్‌లో అన్నిరకాల వస్త్రాలపై 30శాతం, ఇక్కత్ సిల్క్స్ చీరలపై 40 శాతం తగ్గింపు ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల చేనేత వస్త్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి బీమా పరిహారం
ఖమ్మంగాంధీచౌక్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రేపల్లె చెన్నారావు కుటుంబానికి ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.51,91,237.16 బీమా క్లెయిమ్‌ను అందించింది. ఎస్‌బీఐ నుంచి చెన్నారావు రూ.53.10లక్షల గృహరుణం తీసుకున్న సమయాన బీమా కూడా చేయించాడు. ఇటీవల ఆయన మృతి చెందడంతో నామినీ భార్గవికి సంస్థ ఏజీఎం సత్యంనాయుడు శుక్రవారం చెక్కు అందజేశారు. చీఫ్ మేనేజర్ (శాంక్షన్స్) సాయిశ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.
వచ్చేనెలలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు


