పట్టుబట్టారు.. కొలువు కొట్టారు !
టీజీపీఎస్సీ గురువారం రాత్రి విడుదల చేసిన గ్రూప్–3 ఫలితాల్లో జిల్లా వాసులు పలువురు సత్తా చాటారు. మెరుగైన ర్యాంకులతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే, ఇందులో కొందరు ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాలు చేస్తుండగా ఇప్పుడు గ్రూప్–3 ఉద్యోగాలు
రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
కామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన కర్నాటి కల్యాణి గ్రూప్–3లో ప్రతిభ కనబరిచి ట్రెజరీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌ఓడీగా ఉద్యోగం సాధించింది. కర్నాటి కృష్ణ–సైదమ్మ దంపతుల రెండో కుమారై అయిన ఆమె చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తోంది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా, 2024లో గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు సాధించిన ఆమె ఇప్పుడు గ్రూప్–3 ఉద్యోగానికి ఎంపికై ంది. భర్త జంగం నరసింహారావు ప్రోత్సాహంతో మరింత ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యమని కల్యాణి వెల్లడించింది.
పట్టుబట్టారు.. కొలువు కొట్టారు !


