పెద్దమ్మతల్లి గుడిలో చోరీ
రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడు పెద్దమ్మతల్లి దేవాలయంలో దొంగతనం జరిగింది. బూడిదంపాడు ముదిరాజ్ సంఘ సభ్యులు, దాతల సహకారంతో నిర్మించిన ఈ ఆలయానికి గురువారం సాయంత్రం తాళం వేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 6గంటల సమయాన గ్రామస్తులు వచ్చేసరికి గుడి తాళం పగలగొట్టి ఉండగా, హుండీ ధ్వంసమైంది. దీంతో హండీలోని రూ.15వేల మేర నగదు చోరీ జరిగినట్లు రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉన్నత శిఖరాలకు ఎదగాలి
రుద్రంపూర్: విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి పాలిటెక్నిక్ క్రీడా పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల ద్వారా స్నేహభావం ఏర్పడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. కొత్తగూడెం, మధిర, మణుగూరు, ఖమ్మం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు ఎస్‌బీఐటీ, ఎస్‌సీఐటీ, దరిపెల్లి అనంత రాములు, సత్తుపల్లి ఎస్‌ఎస్‌ఐటీ, ఎంఎస్‌ఐటీ కళాశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొని క్రీడా ప్రతిభ చాటారు. ఈ కార్యక్రమంలో క్రీడల కన్వీనర్ కరుణకుమార్, స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అండ్ ఫిజికల్ డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు


