ఐదేళ్ల తర్వాత చిక్కిన నిందితులు
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని రైల్వేస్టేషన్‌లో ఐదేళ్ల క్రితం నగల వ్యాపారిపై కత్తులతో దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన రాజస్థాన్‌కు చెందిన కిరాయి దోపిడీ దొంగలను ఖమ్మం జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను శుక్రవారం జీఆర్పీ సీఐ అంజలి వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శ్రీపాల్ జైన్ విజయవాడలో ఉంటూ బంగారం, వెండి వ్యాపారం చేస్తున్నాడు. ఆర్డర్లపై బంగారం, వెండి ఆభరణాలను ఖమ్మంలోని వ్యాపారులకు సరఫరా చేసేవాడు. 2020 మార్చి 2న కూడా ఖమ్మంలో వ్యాపారులకు ఆభరణాలు అప్పగించి తిరిగి విజయవాడ వెళ్లేందుకు స్టేషన్‌కు వస్తున్నాడు. ఈక్రమంలో ఆయనను అనుసరిస్తున్న రాజస్థాన్‌కు చెందిన భరత్ సోలంకి, రఫీఖాన్, మహేష్ కత్తులతో దాడిచేసి ఆభరణాల బ్యాగ్ లాక్కుని పారిపోయారు. ఘటనపై అప్పట్లో జీఆర్పీ పోలీసులు విచారిస్తుండగా ఘటన వెనుక శ్రీపాల్‌కు తెలిసిన రాజస్థాన్ వాసి మీఠాలాల్, ఆయన తమ్ముడు భరత్‌కుమార్ ఉన్నట్లు బయటపడింది. రాజస్థాన్ నుంచి భరత్ సోలంకి, రఫీఖాన్, మహేష్‌కు డబ్బులు ఇస్తానని పిలిపించి రూ.4.16లక్షల విలువైన సొత్తు అహహరించినట్లు గుఇర్తంచారు. కొన్నాళ్ల క్రితం మీఠాలాల్‌ను అరెస్ట్ చేయగా, భరత్, రఫీఖాన్, మహేష్ ఆచూకీ తెలియడంతో అరెస్ట్ చేసి ఆభరణాల వివరాలు ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ సురేష్, ఉద్యోగులు శ్రీనివాసరావు, సత్యనారయణరెడ్డి, మురళీకృష్ణ, అస్సాను, ప్రభాకర్, నాగరాజు, నాగరాజరావు, రామకృష్ణ, రఫీ, రమేష్, షరీఫ్, సురేష్, రఫీని సీఐ అభినందించారు.
వ్యాపారి నుంచి బంగారం దోచుకున్న కేసు


