
రోజంతా ఆటపాటలే!
విద్య, వైజ్ఞానిక అంశాల్లో
పోటీల నిర్వహణ
అమలును పరిశీలించిన కలెక్టర్
అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ
బొమ్మల తయారీ..
ఆనందంగా ఉంది
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం: ప్రతీ నెల నాలుగో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలనే నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచనలతో జిల్లావ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు బ్యాగ్‌లు లేకుండా వచ్చేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈమేరకు పిల్లలు అలాగే రావడంతో రోజంతా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించడమే కాక విద్య, వైజ్ఞానిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే, పర్యావరణ స్పృహ పెంపొందించేలా మట్టితో గణేష్ ప్రతిమలు, పేపర్ క్రాఫ్ట్ తయారీ నేర్పించారు. అంతేకాక మాక్ పోలింగ్ నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు.
పోటీలు.. ఆటపాటలు
ఖమ్మం శాంతినగర్ పాఠశాలలో స్పెల్ బీ పోటీలు, మట్టితో వినాయకుడి ప్రతిమ, ఇతర బొమ్మల తయారీని నేర్పించారు. అలాగే, కాగితాలు, ఆకులతో బొమ్మల తయారీపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఆపై చంద్రయాన్ ప్రయోగం, ఉన్నత స్థానాల్లో ఉన్న వారి విజయగాధల వీడియోలు ప్రదర్శించారు. ఆతర్వాత ఆటలు, పాటలు, క్విజ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘నో బ్యాగ్ డే’ నిర్వహణతో రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థుల్లో నూతనోత్సాహం వస్తుందని.. తద్వారా మిగతా రోజుల్లో చదువుపై శ్రద్ధ కనబరుస్తారని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
విద్యార్థుల్లో ప్రతిభ వికాసానికే..
విద్యార్థుల అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఆటలు, సంగీతం, నృత్యం, ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ‘నో బ్యాగ్ డే’ ఉద్దేశమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆయన వెళ్లగా విద్యార్థులు కాగితం, పూలతో చేసిన పుష్పగుచ్ఛాలు ఇవ్వగా అభినందించారు. అలాగే, విద్యార్థులు చేసిన గ్రీటింగ్ కార్డులు, పోస్టర్లు, మట్టి ప్రతిమలను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. పుస్తకాల బరువు తగ్గించి పిల్లలకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తించేలా ఉపాధ్యాయులు ‘నో బ్యాగ్ డే’ నిర్వహించాలని సూచించారు. అనంతరం వీ.వీ.పాలెం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు కలెక్టరేట్‌కు రాగా కలెక్టర్ అనుదీప్ వారితో మాట్లాడి కలెక్టరేట్‌లోని కార్యాలయాల కార్యకలాపాలు, అధికారుల విధులపై అవగాహన కల్పించారు. ఇక ఖమ్మం మోమినాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించి మాట్లాడారు. పిల్లల్లో సామాజిక చైతన్యం కలిగించేలా వివిధ కార్యక్రమాలను నో బ్యాగ్ డే రోజున నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఈఓ నాగపద్మజ, ఎంఈఓ శైలజాలక్ష్మి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు శ్రీమన్నారాయణ, ఏ.రమాదేవి, శారద, డోరిస్, శైలజ, మాధవి, దాస్, వెంకటేశ్వర్లు, నగేష్, నాగులు, పుల్లయ్య, ఆదర్శ్‌కుమార్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
‘నో బ్యాగ్ డే’
మా పాఠశాలలో ఆకులతో రకరకాల పక్షులు, జంతువుల బొమ్మలను తయారు చేయడాన్ని టీచర్లు నేర్పించారు. అంతేకాక అందరం కలిసి మైదా పిండితో వినాయక విగ్రహాలను తయారు చేశాం. బ్యాగ్ లేకుండా వచ్చిన మాకు కొత్త విషయాలు నేర్పించారు.
– బి.సాకేత్, 4వ తరగతి, బీ.కే.బజార్ స్కూల్
మా పాఠశాలలో నో బ్యాగ్ డే ను నిర్వహించారు. రోజంతా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించడంతో అందరం ఆనందంగా పాల్గొన్నాం. ఉపాధ్యాయులు స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. అలాగే, మట్టితో గణపతి విగ్రహాల తయారీని నేర్పించారు. – హేమలత, పదో తరగతి,
శాంతినగర్ హైస్కూల్, ఖమ్మం

రోజంతా ఆటపాటలే!

రోజంతా ఆటపాటలే!

రోజంతా ఆటపాటలే!

రోజంతా ఆటపాటలే!

రోజంతా ఆటపాటలే!