
ఓపీఎస్‌ను పునరుద్ధరించాల్సిందే...
● టీఎస్ సీపీఎస్ ఈయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్ ● కార్యాలయాలు, విద్యాసంస్థల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన
ఖమ్మం సహకారనగర్: గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ 28ను రద్దు చేయడమే కాక పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఎస్ సీపీఎస్ ఈయూ) జిల్లా అధ్యక్షులు చంద్రకంటి శశిధర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే తమ జీవితాలు బాగు పడతాయని ఆశిస్తే పదేళ్లయినా ఫలితం లేదని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించకుండానే తెలంగాణ సీపీఎస్ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానంలోనే కొనసాగుతారని లేఖ ఇచ్చిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉద్యోగులు వేముల శంకర్, పవన్, గిరిజా, కేశవ లక్ష్మీ, అజీ బాబాతో పాటు టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తదితరులు పాల్గొన్నారు.
● పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరించాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.అనిల్‌కుమార్, ఎం.సురేష్ కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు.
వీఎస్‌ఎస్ సభ్యుల అభ్యున్నతికి కృషి