
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. మధిర జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి వేముల దీప్తి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ, కోర్టు సిబ్బంది తోట వెంకన్న, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
వచ్చేనెల 13న
జాతీయ లోక్‌అదాలత్
ఖమ్మం లీగల్: పెండింగ్ కేసుల పరిష్కారం, కక్షిదారులకు సత్వర న్యాయమే లక్ష్యంగా వచ్చేనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ఉమాదేవి తెలిపారు. ఖమ్మం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం పోలీస్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయమూర్తులతో శనివారం సమావేశమైన ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు కేసుల రాజీకి రుసుము ఉండదని, కోర్టు ఫీజు సైతం వెనక్కి ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇరువర్గాలు రాజీ పడితే సమ యం ఆదా అవుతుందన్నారు. కాగా, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, మత్తు పదార్థాలతో నష్టంపై విద్యాసంస్థల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి సూచించారు. న్యాయమూర్తులు అపర్ణ అర్చనకుమారి రాంప్రసాద్‌రావు, దీప, మాధవి, న్యాయవాదులు, అధికారులు బిల్ల శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, దిలీప్, గురజాల సీతారామరావు, విష్ణువందన పాల్గొన్నారు.
మైనార్టీ కళాశాల్లో
ప్రవేశానికి దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాలల ఆర్‌సీఓ ఎం.జే.అరుణకుమారి తెలిపారు. మైనార్టీ(ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, సిక్కులు) విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీఎంఆర్ జూనియర్ కళాశాలల్లో చేరడానికి అర్హులని తెలిపారు. ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకుంటే 29న నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాల కోసం ఖమ్మం(బాలికలు), కొత్తగూడెం(బాలురు)లోని సీఓఈ కేంద్రాల్లో లేదా 91543 65017, 78931 16918 నంబర్లలో సంప్రదించాలని అరుణకుమారి సూచించారు.
స్తంభాద్రి సహకార
బ్యాంకు చైర్మన్‌గా ‘ఎర్నేని’
ఖమ్మంవ్యవసాయం: స్తంభాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ నూతన పాలకవర్గాన్ని శనివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్‌గా ఎర్నేని రామారావు, వైస్ చైర్మన్‌గా దయాని వసంతకుమార్ పటేల్ ఎన్నికయ్యారు. అంతేకాక డైరెక్టర్లుగా తక్కెళ్లపాటి భద్రయ్య, ఆళ్ల మల్లికార్జునరావు, నల్లమల నవీన్‌చైతన్య, వేము ల నాగేశ్వరరావు, షేక్ హుస్సేన్, గల్లా సత్యనారాయణ, గొడవర్తి నాగేశ్వరరావు, ఈగ పుల్ల య్య, నల్లాన్‌చక్రవర్తుల బదిరీ నారాయణాచా ర్యులు, గరికపాటి విజయ్, మోదుగు నాగేశ్వరరావు, గన్నమనేని లక్ష్మి, ఎర్నేని కవిత ఎన్నికయ్యారు. సహకార శాఖ ఉద్యోగులు అవధానుల శ్రీనివాస్, మురళి ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. అనంతరం చైర్మన్ రామారావు మాట్లాడుతూ బ్యాంకు రూ.57 కోట్ల డిపాజిట్లు, రూ.100కోట్ల లావాదేవీలతో కొనసాగుతోందని తెలిపారు. ఆతర్వాత చైర్మన్‌ను డైరెక్టర్ గల్లా సత్యనారాయణ తదితరులు సన్మానించారు.

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం