
ఐడియాథాన్‌లో మెరిసిన డిగ్రీ కళాశాల విద్యార్థినులు
కొణిజర్ల: హైదరాబాద్‌లో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) ఆధ్వర్యాన నిర్వహించిన ఐడియాథాన్‌లో కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీకళాశాల విద్యార్థినులు సత్తాచాటారు. కళాశాలకు చెందిన ఎం.విజయలక్ష్మి, కీర్తన, దివ్య ‘కవచ్’ పేరుతో అనారోగ్యంతో ఉన్నప్పుడు హెచ్చరికలు జారీచేసే రిస్ట్‌బ్యాండ్‌ను, కొత్తప్రాంతాల్లో చిరునామా తెలు సుకునేలా ‘ఏకం’ పేరిట ‘వాయిస్ అసిస్టెంట్ ఫర్ ద పీపుల్ బై ట్రావెలింగ్’ లొకేషన్ మ్యాప్ ను సీహెచ్.కావ్య, ఐశ్వర్య, శరణ్య ప్రదర్శించా రు. ఈ ఆవిష్కరణలను అభినందించిన న్యా యనిర్ణేతలు విద్యార్థినులకు టాప్–25 జాబితా లో చోటు కల్పించారు. విద్యార్థినులను కళాశా ల ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ ఎం. నవ్య, కోఆర్డినేటర్లు కే.పీ.ఐశ్వర్య, దీప్తి, అధ్యాపకులు అభినందించారు.
గొల్లపూడి
జీపీ కార్యదర్శి సస్పెన్షన్
రూ.2 లక్షల దుర్వినియోగంతో చర్యలు
వైరారూరల్: వైరా మండలంలోని గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గొల్లపూడి పరిధిలో సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.7 లక్షల నగదు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఖాతాలో జమ కాగా ఆ నిధులను డ్రా చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ పంచాయతీ కార్యదర్శి తోట సునీత రూ.7 లక్షలు డ్రా చేసినా జీపీ ఖాతాలో రూ.5 లక్షలే జమచేసింది. దీంతో విచారణ చేపట్టగా రూ.2 లక్షల నగదు దుర్వి నియోగమైనట్లు తేలడంతో సునీతను సస్పెండ్ చేశారు. అలాగే, పంచాయతీ ప్రత్యేకాధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణచైతన్యకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
స్పెషల్ డ్రైవ్‌లో
55 మోటార్‌సైకిళ్లు సీజ్
తల్లాడ: తల్లాడలో పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుతుపుతున్న 55 మంది మోటార్ సైకిళ్లను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించడమే కాక అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
తల్లాడ: ప్రజలు ఇళ్లలోనే కాక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులు దరిచేరవని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి చందునాయక్ తెలిపారు. తల్లాడ పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన మండలంలోని మిట్టపల్లిలో ఫీవర్ సర్వేనుపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రా మపంచాయతీ సిబ్బంది సమష్టిగా పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా చూడాలని తెలిపారు. ఇదేసమయాన ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు మౌనిక, గోపి, ఉద్యోగులు నవీన్‌కుమార్, కె.పెద్దపుల్లయ్య, రామ, రాజశ్రీ, పద్మ పాల్గొన్నారు.
కమిషనర్ వచ్చారు..
వెళ్లారు!
వైరా: వైరా మున్సిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న చింతా వేణునునల్లగొండ జిల్లా నందికొండకు, అక్కడి కమిషనర్ యు.గురులింగంను వైరాకు బదిలీ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో గురులింగం శుక్రవారం బాధ్యతలు స్వీకరించాక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్‌ను కలిసేందుకు కారేపల్లి వెళ్లారు. అయితే, పలువురు కాంగ్రెస్ నాయకులు కమిషనర్‌గా వేణునే కొనసాగించాలని ఎమ్మెల్యేను కోరడంతో ఆయన గురులింగంను రెండు నెలలు ఆగాక రావాలని సూచించినట్లు సమాచారం. దీంతో వేణు బదిలీ ఆగిపోగా, గురులింగం అసంతృప్తితో వెనుదిరిగినట్లు తెలిసింది. కారణాలు ఏమైనా కమిషనర్ల బదిలీ ఆగిపోవడం చర్చనీయాంశంగా మారింది.