
పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశమైన ఆమె మాట్లాడారు. పీఎంశ్రీ నిధులతో చేపట్టిన పనులు, పాఠశాల నిర్వహణ గ్రాంట్ ద్వారా పూర్తిచేసిన పనులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, సంస్కృతిపై అవగాహన కల్పించాలని తెలిపారు. డీఈఓ నాగ పద్మజ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఆమోదంతోనే పశువుల కొనుగోలు
ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీలో భాగంగా లబ్ధిదారుల ఆమోదంతో పాడి పశువులను కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా డెయిరీలో మొదటి విడతగా 125 మంది సభ్యులకు రెండేసి పాడి పశువులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కమిటీ సభ్యులు లబ్ధిదారులతో నిర్దేశిత ప్రాంతాలకు వెల్లి పశువులు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.నవీన్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ