
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని సీతంపేటకు చెందిన మేడ వెంకయ్య (49) ఇటీవల పురుగులమందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం పురుగుల మందు తాగగా కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందడంతో వెంకయ్య కుమారుడు జాషువా ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
రఘునాథపాలెం: మండలంలోని చింతగుర్తి సమీపాన గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పంగిడికి చెందిన అజ్మీరా రాందాస్ (35) ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా నియంత్రణ తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొనడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాందాస్ భార్య స్వరూప ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
చికిత్స పొందుతున్న మహిళ..
కూసుమంచి: మండలంలోని గోపాలరావుపేటకు చెందిన కుమ్మరికుంట్ల ఉమారాణి (25) ఈ నెల 3వ తేదీన భర్తతో గొడవపడి గడ్డిమందు తాగింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఉమారాణి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
కట్లేరులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఎర్రుపాలెం: మండలంలోని కట్లేరు ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని పురుషుడి(45) మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. మృతదేహంపై దుస్తులు లేవని, ఆయన ఆచూకీ తెలిసిన వారు 87126 59164, 87126 59165 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై రమేష్‌కుమార్ సూచించారు. కాగా, మృతదేహాన్ని మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
జ్వరంతో విద్యార్థులకు అస్వస్థత..
సత్తుపల్లి: సత్తుపల్లి మై నార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు జ్వరా ల బారిన పడ్డారు. రెండు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్న తొ మ్మిది మందిని శుక్రవా రం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రిలో బెడ్లు సరి పడా లేక ఒక్కో పడకపై నలుగురికి చికిత్స అందిస్తున్నారు. కాగా, గంగారం పీహెచ్‌సీ ఆధ్వర్యాన మూడు రోజులుగా మైనార్టీ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ఆర్.అవినాష్ తెలిపారు. అయితే, రెండురోజులుగా జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను ఇళ్లకు పంపించకుండా పాఠశాలలోనే ఉంచడంతో పలువురికి తీవ్రత పెరగగా.. ఇంకొందరికి జ్వరం సోకిందని తెలిసింది.
బోనకల్ గురుకుల విద్యార్థినులకు..
బోనకల్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్ధిర్థిలు జ్వరాల బారిన పడ్డారు. సుమారు 20మంది జ్వరంతో బాధపడుతుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడంతో వైద్యాధికారి స్రవంతి చికిత్స చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాఠశాల ఆవరణలో నీరు నిలవగా దోమలు పెరిగి విద్యార్థినులు జ్వరాల బారిన పడినట్లు తెలిసింది.
ప్రభుత్వాస్పత్రిలో
కొనసాగుతున్న చికిత్స