
మూడు నెలల్లో ముగ్గురు మృతి
ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపాన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో ఇక్కడ 12ప్రమాదాలు జరగ్గా ముగ్గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చకుండా మరమ్మతులతోనే సరిపెడుతుండడం.. మళ్లీ రెండు, మూడు నెలల్లో యథాస్థితికి చేరుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. వారంలో సగటున రెండు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున జాతీయ రహదారి అధికారులు ఈ స్థలాన్ని బ్లాక్‌స్పాట్‌గా గుర్తించి నియంత్రణపై దృష్టి సారించారు.