
పుస్తక పఠనంతో లక్ష్య సాధన
సత్తుపల్లిటౌన్/సత్తుపల్లి(కల్లూరు): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవడమే కాక వాటిని సాధించేలా పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. సత్తుపల్లి, కల్లూరులోని గిరిజన సంక్షేమ హాస్టళ్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డార్మెటరీలు, వంటగదులు, స్టోర్‌రూం, పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం వేడివేడి ఆహారమే విద్యార్థులకు వడ్డించాలని వార్డెన్లను ఆదేశించారు. నాణ్యమైన సరుకులే తీసుకుంటూ ఎప్పటికప్కుపడు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన పీఓ రోజువారీ సబ్జెక్టులతో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు చదవాలని సూచించారు. కాగా, కల్లూరు హాస్టల్‌ను సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో కలిసి పరిశీలించిన పీఓ రాహుల్ ఇటీవల విద్యార్థినులకు నాసిరకం ఆహారం అందించడంతో ఆస్పత్రి పాలయ్యారని, ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. వార్డెన్లు బి.రాములు, మాధవి, ఏడీహెచ్‌ఓ సైదులు, హెచ్‌ఎం శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్