
మరింత వేగంగా ఇళ్ల నిర్మాణం
బోనకల్/ఎర్రుపాలెం/చింతకాని: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలో వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని మండలాల్లో నిర్మాణాలను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు వేగంగా చేపడు తుంటే బిల్లులు త్వరగా మంజూరవుతాయని తెలి పారు. అలాగే, సీజనల్ వ్యాధుల కట్టడిపై పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. నాగులవంచలో ఆరోగ్య కేంద్రం, పాఠశాలను డీపీఓ తనిఖీ చేశారు. ఎంపీఓలు శాస్త్రి, జి.శ్రీలక్ష్మి, పర్వీన్ ఖైసర్, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.