ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఇండోర్‌లో స్టడీ టూర్‌కు బుధవారం బయలుదేరింది. ఈమేరకు సాయంత్రం వారు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ చేరుకున్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా ఆధ్వర్యాన రెండు రోజుల పాటు సాగే స్టడీ టూర్‌లో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొంటారు.
ఖమ్మం వాసి నౌరీన్‌కు డాక్టరేట్
ఖమ్మం అర్బన్: ఖమ్మంకు చెందిన మహమ్మద్ నౌరీన్ తెలుగు విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. ‘ముస్లిం మైనార్టీ కథలు – సాంస్కృతిక అంశాల అధ్యయనం’ అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి ఉస్మాని యా యూనివర్సిటీనుంచి డాక్టరేట్ ప్రకటించా రు. ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ నా రాయణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న నౌరీన్ మాట్లాడుతూ గైడ్ డాక్టర్ నాళేశ్వరం శంకరం, తన భర్త సమీర్ పాషా సహకారంతో పరిశోధన పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మెదక్ టీజీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శిరీష, అధ్యాపకులు అభినందించారు.
రాష్ట్ర వాలీబాల్ జట్టులో జిల్లా క్రీడాకారిణి
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–15 బాలికల వాలీబాల్ పోటీల్లో ఖమ్మంకు చెందిన జి.డి.హన్సినీ ప్రతిభ చాటింది. దీంతో పూణేలో జరగనున్న జాతీయస్థాయి అండర్–15 బాలికల టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఆమెను ఎంపిక చేశారు. ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్‌లో చదువుతున్న హన్సినీ సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ పొందుతుండగా, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, హార్వెస్ట్ కరస్పాడెంట్ రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి అభినందించారు.
డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలు
ఖమ్మంఅర్బన్: జల వనరుల శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43 మందికి అదనపు బాధ్యతలు కేటాయించగా జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఉన్నారు. తిరుమలాయపాలెం డీఈఈ రమేశ్‌రెడ్డికి పాలేరు ఈఈగా, ఖమ్మం సీఈ కార్యాలయంలో డీఈ కె.శోభారాణికి అదే కార్యాలయంలో డీసీఈగా అదనపు బాధ్యత లు అప్పగించారు. అలాగే, సత్తుపల్లి ఈఈ ఎస్.శ్రీనివాస్‌రెడ్డికి కల్లూరు డీఎస్‌ఈగా, మధి ర డీఈఈ రాంప్రసాద్‌కు మధిర ఈఈగా బాధ్యతలుఅప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. అంతేకాక భదాద్రి జిల్లా కొత్తగూడెం ఈఈ బి.అర్జున్‌కు ఆ జిల్లా డీసీఈగా, ఇల్లెందు డీఈఈ బి.కృష్ణకు ఇల్లెందు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

స్టడీటూర్‌కు బయలుదేరిన కేఎంసీ పాలకవర్గం