
ఖమ్మం ఫొటోగ్రాఫర్‌కు అవార్డు
ఖమ్మంఅర్బన్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించగా ఖమ్మం నగరానికి చెందిన చావా సంపత్‌కుమార్ రెండు అవార్డులు గెలుచుకున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, రాజీవ్ యువ వికాసం, జనరల్ విభాగాల్లో జరిగిన పోటీల్లో సంపత్ తీసిన చిత్రాలు ఆకర్షించాయి. అవార్డులను హైదరాబాద్‌లోని గ్రీన్ పార్క్ హోటల్‌లో ఆగస్ట్ 19న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు.
మోహినుద్దీన్ ప్రతిభ
తిరుమలాయపాలెం: విజయవాడలోని ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో మండలంలోని గోల్‌తండా పరిధిలోని జింకలగూడేనికి చెందిన ఫొటోగ్రాఫర్ మోహినుద్దీన్ ‘సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు – 2025’అందుకున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో మోహినుద్దీన్ తీసిన ఫొటో అవార్డుకి ఎంపికై ంది. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కొంపల్లి సుందర్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ తమ్మా శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, సీఈఓ మల్లికార్జునరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

ఖమ్మం ఫొటోగ్రాఫర్‌కు అవార్డు