పంది మాంసం దుకాణం సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పంది మాంసం దుకాణం సీజ్‌

Aug 17 2025 6:56 AM | Updated on Aug 17 2025 6:56 AM

పంది

పంది మాంసం దుకాణం సీజ్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం కొత్త బస్టాండ్‌ పక్కన వెజ్‌, ఫిష్‌ మార్కెట్‌లో ఎలాంటి అనుమతి లేకుండా పంది మాంసం షాప్‌ ఏర్పాటుచేయడంపై కేఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు దుకాణాన్ని సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహకుడికి రూ.3వేల జరిమానా విధించారు. శానిటరీ సూపర్‌వైజర్‌ ఎం.సాంబయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్య, జవాన్‌ పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ ట్రక్కు చోరీ

చింతకాని: మండలంలోని గోవిందాపురం(ఎల్‌) గ్రామానికి చెందిన రైతు ధర్మపురి పుల్లారావు ట్రాక్టర్‌ ట్రక్కు చోరీకి గురైంది. రైతు ఏడాది క్రితం ట్రాక్టర్‌ ఇంజన్‌, ట్రక్కు కొనుగోలు చేయగా, ప్రొద్దుటూరులో స్నేహితుడైన పాసంగులపాటి విష్ణువర్ధన్‌ అవసరాలకు శుక్రవారం పంపించాడు. ఆయన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి ట్రక్కు చోరీ కావడంతో శనివారం పుల్లారావుకు సమాచారం ఇచ్చాడు. దీంతో రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.

‘ఉపాధి’ కార్యాలయంలో అగ్నిప్రమాదం

ఏన్కూరు: ఏన్కూరు మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారనంగా మంటలు చెలరేగాయి. పథకం ప్రారంభమైనప్పటి నుంచి జరగిన పనుల రికార్డులు, ఇతర పైళ్లు అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. అలాగే, బీరువాలు, ఇతర సామాగ్రి కూడా కాలిపోయాయి. మంటలు మొదలైన విషయం తెలియగానే ఏపీఓ సూరయ్య తహసీల్దార్‌, ఎస్‌ఐతో పాటు అగ్నిమాపక శాఖకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే స్థానికులు, రేపల్లెవాడ వాసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎంపీడీఓ జీవీఎస్‌. నారాయణ, ఎస్‌ఐ రఫీ, ఆర్‌ఐ శ్రీనివాస్‌ పరిశీలించి వివరాలు సేకరించారు.

బైక్‌ కొనివ్వలేదని తండ్రిపై గొడ్డలితో దాడి

ఖమ్మంరూరల్‌: పల్సర్‌ బైక్‌ కొనివ్వలేదంటూ ఓ వ్యక్తిపై ఆయన కుమారుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన ఇది. ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెంకు చెందిన బండారు నాగయ్య – లక్ష్మికి కుమారుడు సతీష్‌ ఉన్నాడు. ఇటీవల ఆయనకు సెల్‌ఫోన్‌ కొనిచ్చారు. అనంతరం ఈనెల 13న పల్సర్‌ బైక్‌ కొనివ్వాలని కోరగా అంత డబ్బు లేదని, ఏదైనా పని చేసుకుని బైక్‌ కొనుక్కోవాలంటూ సూచించారు. కానీ సతీష్‌ మాత్రం బైక్‌ కొనివ్వకపోతే ఇద్దరినీ చంపుతానంటూ బెదిరించాడు. ఈక్రమంలో 14న రాత్రి అంతా అన్నం తిని పడుకున్నాక అర్ధరాత్రి సమయాన సతీష్‌ తండ్రి నాగయ్య దాడి చేయడంతో నుదురు, దవడపై తీవ్ర రక్తస్రావమైంది. దాడిని అడ్డుకోబోయిన నాగలక్ష్మికి వెళ్లడంతో ఆమె కేకలు వేయగా ఇరుగుపొరుగు రావడంతో సతీష్‌ పారిపోయాడు. దీంతో నాగయ్యను ఆస్పత్రికి చేర్పించగా.. నాగలక్ష్మి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

పంది మాంసం  దుకాణం సీజ్‌1
1/1

పంది మాంసం దుకాణం సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement