
యూరియా కష్టాలు తీరవా?
వాతావరణ ం
జిల్లాలో బుధవారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది.
● పీఏసీఎస్‌ల ముందు రైతుల బారులు ● సరిపడా అందక ఆందోళన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పంటల సాగు జోరందుకున్న వేళ ఏపుగా పెరగడానికి యూరియా అవసరం. కానీ పడిగాపులు కాస్తున్నా సరిపడా అందక అదును దాటుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్‌లకు యూరియా స్టాక్ వచ్చిందని తెలియగానే పరుగులు తీస్తున్నారు. మునుపెన్నడూ ఈ పరిస్థితి లేకపోగా, ఈసారి యూరియా కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలోని కారేపల్లి, కొణిజర్లల్లో మంగళవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. నిత్యం రెండు, మూడు చోట్ల ఇదే పరిస్థితి ఎదురవుతుండగా పలుచోట్ల ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయితే, కేంద్రం నుంచే యూరియా తగినంత రావడం లేదని, ఉన్న వరకు ఇస్తున్నామంటూ పీఏసీఎస్‌ల బాధ్యులు సర్దిచెబుతున్నారు.
ఈ మూడు నెలలే కీలకం..
యూరియా ఎక్కువగా పత్తి, వరి పంటలకే అవసరమవుతుంది. పత్తికి నాలుగైదు సార్లు యూరియా వేయాల్సి ఉంటుంది. ఇక వరి నాట్లు ముమ్మరమవుతుండడంతో పంటలకు కావల్సినంతా యూరియా అందుబాటులో ఉండాలి. ప్రధానంగా వచ్చే రెండు నెలల్లో వరికి యూరియా కీలకం కానుంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 54,826 మెట్రిక్ టన్నుల యూరియా పంటలకు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు జిల్లాకు 15,719 మెట్రిక్ టన్నులే సరఫరా అయింది. ఈ సీజన్‌లో 12,414 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశారు. వచ్చే నెలలో జిల్లాకు 21,244 మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని అంచనా. పత్తి, వరి పంటలకు యూరియా కీలకం కావడంతో రైతులతో పాటు అధికారులు కూడా గండం గట్టెక్కడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు.
జిల్లాలో యూరియా అవసరం, సరఫరా (మెట్రిక్ టన్నుల్లో)
నెల అవసరం సరఫరా
జూలై 7,500 6,434
ఆగస్టు 4,610 1,631
సెప్టెంబర్ 21,244 –––
గరిష్టం / కనిష్టం
300 / 230