
కాపు రాక ఆయిల్‌పామ్ మొక్కల తొలగింపు
వేంసూరు: ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలం లాభాలు వస్తాయని రైతులు భావిస్తే ఆఫ్‌టైప్ మొక్కలతో నిరాశే మిగులుతోంది. నాలుగేళ్ల పాటు పెట్టుబడి పెట్టి కంటిపాపలా పెంచిన మొక్కలకు గెలలు రాకపోవడంతో చేసేదేం లేక మొక్కలు తొలగిస్తున్నారు. వేంసూరు మండలం వైఎస్.బంజర్ గ్రామానికి చెందిన మహిళా రైతు కొప్పుల శ్రీదేవి అశ్వారావుపేట నర్సరీ నుంచి మొక్కలు తెచ్చి ఆరెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. అయితే, నాలుగేళ్లు దాగినా దిగుబడి రాకపోవడంతో ఆఫ్‌టైప్ మొక్కలుగా తేలింది. ఆయిల్‌ఫెడ్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో మంగళవారం జేసీబీతో ఆయా మొక్కలను తొలగించారు.