ఆర్టీసీకి కలిసొచ్చింది.. | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి కలిసొచ్చింది..

Aug 12 2025 12:43 PM | Updated on Aug 12 2025 12:43 PM

ఆర్టీ

ఆర్టీసీకి కలిసొచ్చింది..

వరుస సెలవులతో ప్రయాణికుల రద్దీ
● నాలుగు రోజుల్లో రూ.1.21 కోట్ల ఆదాయం ● అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షలు

రద్దీలోనూ మహాలక్ష్మి

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు విపరీతమైన రద్దీలోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేశారు. రక్షా బంధన్‌ పండుగ రోజు రీజియన్‌ వ్యాప్తంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 1.50 లక్షల మంది మహిళామణులు ప్రయాణించారు. ఈరోజు మొత్తంగా 2లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక ఆదివారం అదనంగా 137 సర్వీసులు నడిపించారు. కాగా, రీజియన్‌కు రికార్డు స్థాయిలో కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారానే రూ.1.21 కోట్ల ఆదాయం

నమోదుకాగా.. అత్యధికంగా మధిర డిపో నుంచి రూ.29.84 లక్షల ఆదాయం సమకూరింది.

నాలుగు రోజుల్లో డిపోల వారీగా

ఆదాయం (ప్రత్యేక సర్వీసుల ద్వారా)

డిపో కిలోమీటర్లు ఆదాయం

(రూ.లక్షల్లో)

మధిర 42,316 29.84

భద్రాచలం 42,958 25.81

ఖమ్మం 38,022 20.99

సత్తుపల్లి 26,122 15.58

మణుగూరు 24,096 12.05

కొత్తగూడెం 15,155 9.16

ఇల్లెందు 11,797 7.88

మొత్తం 2,00,466 121.35

ఖమ్మంమయూరిసెంటర్‌: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వత్రం, రాఖీ పౌర్ణమి రెండో శనివారం.. ఆ తర్వాత ఆదివారం కావడంతో జనమంతా ఊర్ల బాట పట్టడం ఆర్టీసీకి కలిసొచ్చింది. ఈనెల 7నుంచి 10వ తేదీ వరకు ఆర్టీసీ ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల ద్వారా 374 బస్సులు నడిపించారు. ఆ బస్సుల్లో లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో కాసుల పంట పండింది.

ప్రణాళికాయుతంగా..

ఈనెల 8న శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోగా విద్యాసంస్థలకు ఆప్షనల్‌ హాలీడే ఇచ్చారు. ఆ మరుసటి రోజు రాఖీ పండుగ, ఆపై ఆదివారం కలిసొస్తుండడంతో చాలా మంది 7వ తేదీనే సొంత ఊర్లకు పయనమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలకు ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక 9వ తేదీన హైదరాబాద్‌తో పాటు జిల్లాలో రద్దీ ఉన్న ప్రాంతాలకు బస్సులు తిప్పారు. అంతేకాక 10వ తేదీ ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యేవారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తూ బస్టాండ్లలో అదనపు సిబ్బంది ద్వారా పర్యవేక్షించడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు.

రద్దీకి అనుగుణంగా సర్వీసులు

రాఖీ పండుగ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యాన ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నాం. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన

సేవలు అందించాలని ఉద్యోగులకు సూచనలు చేశాం. డిప్యూటీ ఆర్‌ఎం, డిపో మేనేజర్లతో పాటు నేను కూడా బస్టాండ్లలో పర్యవేక్షిస్తూ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయడంతో ఏ సమస్యా రాలేదు.

– ఏ.సరిరామ్‌, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్‌

9వ తేదీన ఓఆర్‌.. 112

సత్తుపల్లిటౌన్‌: వరుస సెలవులతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఖమ్మం రీజియన్‌లో అదనపు సర్వీసులు నడిపించామని రీజినల్‌ మేనేజర్‌ సరిరామ్‌ తెలిపారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో, బస్టాండ్‌తో పాటు మందలపల్లి, అశ్వారావుపేట బస్టాండ్లను సోమవారం పరిశీలించిన ఆయన సత్తుపల్లిలో మాట్లాడారు. రాఖీ పండుగ రోజున రీజియన్‌లో ఓఆర్‌ 112గా నమోదైందని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రాఖీ పౌర్ణమికి వచ్చే ప్రయాణికుల కోసం 7, 8వ తేదీల్లో 102 అదనపు సర్వీసులు, సత్తుపల్లి–ఖమ్మం మధ్య అదనంగా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నడిపించామని ఆర్‌ఎం వెల్లడించారు. డిపో మేనేజర్‌ యు.రాజ్యలక్ష్మి, అసిస్టెంట్‌ మేనేజర్‌ విజయశ్రీ, ఉద్యోగులు ఎస్‌.సాహితి, బాలస్వామి, వెంకటయ్య, ఆనంద్‌, ఆనందం పాల్గొన్నారు.

ఆర్టీసీకి కలిసొచ్చింది..1
1/4

ఆర్టీసీకి కలిసొచ్చింది..

ఆర్టీసీకి కలిసొచ్చింది..2
2/4

ఆర్టీసీకి కలిసొచ్చింది..

ఆర్టీసీకి కలిసొచ్చింది..3
3/4

ఆర్టీసీకి కలిసొచ్చింది..

ఆర్టీసీకి కలిసొచ్చింది..4
4/4

ఆర్టీసీకి కలిసొచ్చింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement