
జిల్లా జడ్జిని కలిసిన సబ్‌కలెక్టర్
ఖమ్మంలీగల్: కల్లూరు సబ్‌కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అజయ్‌యాదవ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ను సోమవారం కలిశారు. జిల్లా కోర్టులో న్యాయమూర్తిని ఆయన మర్యాదపూర్వకంగా కలవగా వివిధ అంశాలపై చర్చించారు.
రేపు డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ఖమ్మం సహకారనగర్: రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా స్థాయిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. కళాశాల చరిత్ర విభాగం, ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యాన ‘భారతదేశ స్వాతంత్రోద్యమం – ప్రపంచానికి ఆదర్శం’ అంశంపై వ్యాసరచన పోటీ ఈనెల 13న ఉంటుందని వెల్లడించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసే అవకాశం ఉండగా, వివరాలకు 79819 52341, 7731944849 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వ్యక్తిగత పరిశుభ్రత
తప్పనిసరి
ఏన్కూరు: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పా టించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. ఏన్కూరులోని గురుకుల విద్యాలయం, కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల పరిసరాలు, మరుగుదొడ్లు, డార్మెటరీలతో పాటు మధ్యాహ్న భోజనం అమలుతీరును పరిశీలించాక మాట్లాడారు. విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని.. తద్వారా శ్రద్ధగా చదువుకోవచ్చని తెలిపారు. కాగా, విద్యార్థులకు సీఈఓ నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైధ్యాధికారులు బి.రాములు, మౌనిక, ప్రిన్సిపాల్ టి.శ్రీనివాసరెడ్డి, ప్రత్యేకాధికారి లావణ్య, హెచ్‌ఎం రాఘవరావు పాల్గొన్నారు.
రైతు బీమా అర్హుల జాబితా ప్రదర్శన
ఖమ్మంవ్యవసాయం: రైతు బీమా పథకం ఎనిమిది పాలసీకి అర్హులైన రైతుల జాబి తాలను వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా విడుదల చేశారు. ఈ జాబి తాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించగా, అర్హులైన రైతులు తమ దరఖాస్తులకు ధ్రువపత్రాలు జత చేసి రైతు వేదికల్లో ఏఈఓ లకు అందజేయాల్సి ఉంటుంది. కాగా, అర్హులైన రైతులు సకాలంలో రైతు బీమా పథకానికి నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

జిల్లా జడ్జిని కలిసిన సబ్‌కలెక్టర్