
అల్బెండజోల్‌తో రక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: చిన్నారుల శారీ రక, మానసిక ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్న నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్‌లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన మాత్రలు అందజేసి మాట్లాడారు. జిల్లాలో 3,11,317 మంది పిల్లలకు మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎవరైనా మిగిలిపోతే 18వ తేదీన అందిస్తామని చెప్పారు. డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు.