
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి
ఏన్కూరు: గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డీ.ఎస్.నాగేశ్వరావు డిమాండ్ చేశారు. మండలంలోని మూలపోచారం పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో హెచ్‌ఎంలు, సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలి పారు. ఈనేపథ్యాన ఉపాధ్యాయుల బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయులు పుల్లయ్య, బి.శోభన్, బి.రవి, బి.సింగ్యా, సుశ్మిత, వి.రమేష్, ఉషశ్రీ పాల్గొన్నారు.
నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: చోరీ కేసులో నిందితుడిని ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం సంభానీనగర్‌కు చెందిన వరికూటి విజయ్‌కుమార్ ఇంట్లో ఈనెల 5న చోరీ జరగగా దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు ముస్తఫానగర్‌లో చేపట్టిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన చింతకాని మండలం గాంధీనగర్ వాసి నెటుకుమల్లి కృష్ణను ఆరా తీయగా చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించారు. దీంతో 7.5 తులాల బంగారంతో పాటు వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.